భారీ టెలికాం రంగ సంస్థ తన ప్రత్యర్థులకు బారి షాక్ ఇచ్చి మరో సంచలనానికి నంది పలికింది. ‘జియో మీట్’ అనే సరికొత్త వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ ను లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ లకు బాగా డిమాండ్ ఏర్పడిన కారణంగా అనేక సంస్థలు కొత్త కాన్ఫరెన్సింగ్ యాప్ లను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. గూగుల్ మీట్, జూమ్ యాప్, హౌస్ పార్టీ లాంటి యాప్ లు ఇప్పటికే కాన్ఫరెన్సింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇప్పుడు వాటికి ఈ జియో మీట్ బాగా పోటీ ఇవ్వనుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా జియో ఈ యాప్ ను ఆవిష్కరించింది. అయితే ఈ జియో మీట్ చాలా ప్రత్యేకతను కలిగి ఉందని, ఇది ఏ పరికరంతోనైనా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ తోనైనా పనిచేయగలిగే సామర్థ్యం ఉందని జియో ఇన్ఫోకామ్ సీనియర్ విపి పంకజ్ పవార్ వెల్లడించారు. ఇక జియో మీట్ ను స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, డెస్క్ టాప్ ఇలా ఏ యాప్ లోనైనా యాక్సిస్ చేయవచ్చు. ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు.

ఇక ఈ జియో మీట్ ఒక్క వీడియో కాన్ఫరెన్స్ లకు మాత్రమే పరిమితం కాదు. జియో ఇహెల్త్, ఇఎడ్యుకేషన్, వంటి ఇతర ప్లాటుఫామ్ లతో దీనిని అనుసరిస్తారు. దీని వల్ల ప్లాటుఫామ్ లతో వినియోగదారులు వర్చువల్ గా డాక్టర్లను సంప్రదించడానికి ప్రిస్క్రిప్షన్లను పొందడానికి మందులకు ఆర్డర్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకా వర్చువల్ తరగతి గదులు, రికార్డు సెక్షన్లు, హోంవర్కులు, తరగతులను నిర్వహించడం లాంటి వాటికోసం ఇఎడ్యుకేషన్ ప్లాటుఫామ్ సహాయపడుతుంది. ఇక ప్రీ ప్లాన్ లో ఐదుగురు వినియోగదారులు, బిజినెస్ ప్లాన్ లో 100 మంది యూజర్లు వరకు జియో మీట్ పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది.

వికటించిన ప్లాస్మా థెరపీ, కరోనా పేషేంట్ మృతి

మే 1 నుండి ఏటిఎంలకు, పెన్షనర్లకు కొత్త నిబంధనలు..!

ఇకపై ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటేనే ఫోన్ పనిచేస్తుంది..!