ప్రముఖ టెలికాం సంస్థ పండుగ సందర్భంగా తన జియో ఫోన్ పై బంపర్ ఆఫర్ ప్రకటించింది . ఎలాంటి ఫోన్ ఎక్స్ చేంజ్ లేకుండా జియో ఫోన్ ను 1500 రూపాయలకు బదులు 699 రూపాయలకే అందించనుంది. ఇక ఈ ఫోన్ కొన్నవారికి మొదటి 7 రీఛార్జిలకు 99 రూపాయల విలువైన మొబైల్ డేటాను ఉచితంగా అందించనున్నారు. అంటే మొబైల్ ఫోన్ ఫ్రీగా ఇస్తున్నట్లే.

ఈ ఆఫర్ ఇప్పుడు మొదలై దీపావళి పండుగ వరకే అందుబాటులో ఉండనుంది. జియో ప్రకటించిన ఈ ఆఫర్ తో మరోసారి మొబైల్ రంగంలో మరొక పెను తుఫాననే చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ప్రత్యర్థి కంపెనీలకు సవాలు విసురుతూ ముందుకు సాగుతుంది.