ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఒక్కోసారి కంపెనీలు తమ ఉద్యోగస్తులను తొలగించడం జరుగుతూనే ఉంటుంది. ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తొలగించడంతో వారికి ఆర్ధిక ఇబ్బందులు ఒక్కసారిగా చుట్టు ముట్టడంతో వారి కుటుంబాలు ఎంతో ఇబ్బందులకు గురవుతుంటారు. అలాంటి వారికీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చే కొత్త బిల్లు మంచి ఉపశమనం ఇవ్వనుందని తెలుస్తుంది.

అందులో భాగంగా బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా ఓ ప్రైవేట్ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లు ప్రకారం యజమాని దివాళా, ఆర్ధిక మాంద్యం, సాంకేతిక మార్పలు, కోర్టు ఆదేశాలు ఇలా తదితర కారణాలతో ఉద్యోగం నుంచి తొలగిస్తే కనీసం 9 నెలల పాటు మరొక ఉద్యోగం లభించే వరకు అతడికి నిరుద్యోగ ప్రయోజనాలు ఇచ్చి తీరాల్సిందే అన్న బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుతో ఉద్యోగం కోల్పోయే వారు ఆర్ధిక ఇబ్బందులు పడకుండా మంచి ఉపశమనం అని చెప్పుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •