9700 పైగా డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా నియంత్రణ కోసం మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 9700 డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాల భర్తీ చేయబోతున్నామని తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుండి ప్రయాణికులు వస్తున్నందున అదనంగా బెడ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 8 జిల్లాల్లో 30 వేల ఐసోలేషన్ పడకలు ఏర్పాటు చేయబోతున్నట్లు ఆయన తెలియచేసారు. ఇక సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీకి కార్యాచరణ చేస్తున్నామని జవహర్ రెడ్డి తెలిపారు.