ఈరోజు ఉదయం అసెంబ్లీ ప్రారంభమవవడంతోనే గత ప్రభుత్వ హయాంలో గోదావరి పుష్కరాలలో చనిపోయిన 29 మందికి సంబంధించి మరియు బారి అవినీతిపై చర్చ మొదలయింది. దీనిపై జోగి రమేష్ మాట్లాడుతు చంద్రబాబు నాయుడు హీరోలాగా ఫీలై సినిమా షూటింగ్ తీయించుకోవడానికి బోయపాటి శ్రీనివాస్ తో షూట్ చేయించాడని, దీనిపై సరైన విచారణ చేపట్టి బోయపాటి శ్రీనివాస్ కావాలనే షూటింగ్ చేశాడా? లేక చంద్రబాబు నాయుడు షూటింగ్ తీయించుకున్నాడా తెలియాలని అన్నారు. 

పుష్కరాలలో జరిగిన 29 మంది హత్యలకు సంబంధించి మరొక అడుగు ముందుకు వేసి జోగిరమేష్ మాట్లాడుతు కుంభమేళ తరహాలో జనం తరలి రావాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని, అది కుంభమేళ కాదని అది ఒక పెద్ద కుంభకోణమని అన్నారు. దీనిపై ఎవరు ద్రోహులు అన్న విషయం తేలాలని అన్నారు. 

మరొక వైపు రాజానగరానికి చెందిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలలో జరిగిన 29 మంది ప్రమాదానికి సంబంధించి సోమయాజులు కమిటీ తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చిందని, చంద్రబాబు నాయుడుని కాపాడటానికి మాత్రమే ఆ రిపోర్ట్ ఉందని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆ కమిటీ అధ్యక్ధుడు సోమయాజులు కొడుకుకి ఉద్యోగం కూడా అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే 29 మంది చనిపోయిన కుటుంబాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.

chandrababu in puskaralu

 
  •  
  •  
  •  
  •  
  •  
  •