తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంత పాపులర్ పేరు సంపాదించుకుందో, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రమ్యకృష్ణ అంతే పేరును సంపాదించుకుంది. రమ్యకృష్ణకు ఒక రకంగా అటు ఇటుగా హీరోయిన్స్ అందుకునేంత పారితోషకం అందుకుంటూ ఇండస్ట్రీలో తన హావ నడిపిస్తుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తరువాత రాజమాత శివగామిగా మరింత పేరుని సంపాదించుకోవడంతో ఆఫర్ లు వెల్లువలా రావడంతో తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసింది.

అలాంటి రమ్యకృష్ణ అద్భుతంగా జాతకాలు చెబుతుందట. రమ్యకృష్ణ ఎంత అద్భుతంగా జాతకాలు చెబుతుందో సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. రమ్యకృష్ణ జాతకాలు చెబుతారని నాకు తెలిసి ఒకసారి ఆమెను కలసినప్పుడు నాకు పెళ్లి ఎప్పుడు అవుతుందో ఎంత మంది పిల్లలో చెప్పాలని అడగగా ఆమె నా చెయ్యి చూసి మీరు నాకు అబద్ధం చెబుతున్నారని మీకు ఇప్పటికే పెళ్ళైపోయి, ముగ్గురు పిల్లలు ఉండి ఉండాలని అలా అని మీ జాతకం చెబుతుందని చెప్పుకొచ్చారు.

రమ్యకృష్ణ చెప్పినట్లు తనకు పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉండటంతో రమ్యకృష్ణ జాతకం ఎంత కచ్చితంగా చెబుతుందో అని షాక్ తిందాం నావంతైందని చెప్పుకొచ్చారు. జాతకాలు చెప్పడంలో రమ్యకృష్ణ దిట్ట అన్న సంగతి నాకు అప్పుడు అర్థమైందని చెప్పారు. ఇక అంతకు ముందు తరంలో జాతకాలు చెప్పడంలో భానుమతి గారికి తెలుసునని, ఆమె కూడా చెయ్యి చూసి ఇట్టే జాతకం చెప్పేస్తుందని జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ తెలియచేసారు.