బిగ్ బాస్ తెలుగుపై యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి మానవహక్కుల సంఘాలను కూడా కలసి బిగ్ బాస్ ను నిలిపి వేయాలని పోరాడుతుంది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ సినిమా తరహాలో బిగ్ బాస్ హౌస్ లోని క్యాస్టింగ్ కోచ్ జరుగుతుందని, మహిళల ఆత్మభిమానాలు కించపరిచే షోలు నిర్వహిస్తున్నారని తన పోరాటానికి పలువురు మహిళా సంఘాల మద్దతు పలుకుతున్నారని శ్వేతా రెడ్డి అన్నారు. శ్వేతా రెడ్డితో పాటు నటి గాయత్రీ గుప్తా పిఓడబ్ల్యు నేత సంధ్య కూడా పాల్గొన్నారు.

నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో హైకోర్టు లో కేసు వేయగా ఈనెల 29న విచారణకు రానుంది. సినిమా రంగంలో ఎంతో గౌరవంగా ఉన్న అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు 3కు హోస్ట్ గా ఉండటం బాధించే అంశమని, ఇక తమిళనాడులో కూడా ఒక పార్టీని స్థాపించి ఎన్నో నీతులు చెప్పే కమల హాసన్ కూడా అక్కడ బిగ్ బాస్ హోస్ట్ గా ఉండటం భావ్యం కాదని, ఈనెల 24, 25 లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు వస్తున్నారని ఆయనను కలసి బిగ్ బాస్ పై వినాభిపత్రం ఇస్తామని, బిగ్ బాస్ ను ఎట్టి పరిస్థితులలో ఆపే వరకు తాను పోరాడతానని అన్నారు.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •