తెలుగు మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ గురించి గత వారం రోజులుగా రచ్చ తారాస్థాయికి చేరుకుంది. దీనిలో భాగంగా జీవిత రాజశేఖర్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఈ గొడవ మరింత అగ్గి రాజేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఛైర్మెన్ నరేష్ కు అనుమతి తీసుకోకుండా ఇలా అర్జెంటు గా మీటింగ్ కండక్ట్ చేయవలసిన పనేమిటి అని అందరూ భావిస్తున్నారు. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి మాట్లాడుతూ గత 26 ఏళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంతా చాల సవ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంటే ఎప్పుడైతే జీవిత రాజశేఖర్ ఎంటర్ అయ్యారో, అప్పటి నుంచి రచ్చ మొదలైందని, వీరిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడే పెంటేనని అన్నారు.

జీవిత రాజశేఖర్ రాజకీయాలలో ఉన్నా, సినిమా పరిశ్రమలో ఉన్న మరెక్కడ ఉన్న ఇలా రచ్చ జరుగుతుంటే మనవల్ల ఇలా జరుగుతుందే మనలోనే తప్పుందని ఇప్పటికి కూడా గ్రహించకపోతే ఎలా అని శ్వేతారెడ్డి అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో కోలీవుడ్ ఇండస్ట్రీకు సంబంధించిన నడిగర్ సంఘంలో ఎప్పుడూ ఎలాంటి గొడవలు జరగవని, ఈ జీవిత రాజశేఖర్ ను తీసుకొని వెళ్లి ఆ నడిగర్ సంగం లో వేస్తే అప్పటికైనా బుద్ధి వస్తుందేమో అని ఘాటుగా వ్యాఖ్యానాలు చేసింది.