నందమూరి బాలకృష్ణ తరువాత ఆ కుటుంబానికి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ గా గతంలో బాలకృష్ణ – ఎన్టీఆర్ సఖ్యత ఉన్న రోజులలో నందమూరి అభిమానులు ఫీల్ అయ్యేవారు. ఇక 2009 ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు జూనియర్ ను వాడుకొని వదిలేయడంతో జూనియర్ ఎన్టీఆర్ లోలోన రగిలిపోయారు. అదే సందర్భంలో తన కొడుకు లోకేష్ ను టీడీపీలో నెంబర్ 2 స్థానం కట్టబెట్టి ఎన్టీఆర్ ను పక్కన పెట్టడంతో చంద్రబాబు నాయుడుతో కొంత కాలంగా పలకరింపులు కూడా జూనియర్ దూరంగా ఉన్నారు. అదే సమయంలో బాలకృష్ణతో కూడా మనస్పర్థలు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు ఏవో తాను చేసుకుంటూ దూరంగా ఉంటూ వచ్చారు.

కానీ ఈమధ్య నందమూరి హరికృష్ణ చనిపోయిన తరువాత బాలకృష్ణ – ఎన్టీఆర్ చనువుగా మాట్లాడుకోవడంతో నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకో ” ఎన్టీఆర్ బయోపిక్” సినిమాలో నటించలేదు. యూనిట్ సభ్యులు ఎన్టీఆర్ ను నటించాలని కోరలేదా, బాలకృష్ణకు ఎన్టీఆర్ నటించడం ఇష్టంలేదా అనే విషయం పక్కన బెడితే… ” ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్” ఫంక్షన్ కు ఎన్టీఆర్ హాజరై బాబాయ్ – అబ్బాయ్ ఒకటేనని అన్నట్లు చనువుగా మెలిగారు.

ఇక సినిమా విడుదల సందర్భంగా ఈరోజు ఉదయం వేకువ జామునే ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు, ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ఎన్టీఆర్ బయోపిక్ సినిమా విడుదలకు సామాన్య ప్రేక్షకులులా హాజరయ్యారు. ఇదే సందర్భంలో నందమూరి కుటుంబ సభ్యులంతా కూడా సినిమాను చూడటానికి ఆసక్తి చూపించి పొద్దు పొద్దునే థియేటర్స్ కు వచ్చేసారు. తెలుగుదేశం సబ్యులకు, చంద్రబాబు నాయుడుకి దూరంగా ఉండే దగ్గుపాటి వెంకటేశ్వర రావు కూడా సినిమాను చూడటానికి ఆసక్తిగా ప్రీమియర్ షోకు వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడ కనపడలేదు.

జూనియర్ ఎన్టీఆర్ – బాలకృష్ణ విషయంలో అంతా సర్దుకుందని అందరూ అనుకుంటున్నా లోలోన జూనియర్ ఎందుకో వారితో కలవడానికి కొంత తటపటాయిస్తున్నట్లు కనపడుతుంది. దానికి కారణం మొదటి నుంచి నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో వాడుకొని వదిలేస్తూనే ఉన్నారు. అప్పట్లో హరికృష్ణను, తరువాత జూనియర్ ఎన్టీఆర్ ను ఇలా అవసరానికి వాడుకొని కూరలో కరివేపాకులా పక్కన పెట్టడంతో… చంద్రబాబు అండ్ కో తో కొంత దూరం మైంటైన్ చేస్తేనే ఆరోగ్యానికి మంచిది అనుకున్నారా? లేక బాలకృష్ణ – ఎన్టీఆర్ బయట ఉన్నంత సఖ్యత లోలోన మైంటైన్ చేయలేకపోతున్నారో తెలియాల్సి ఉంది. కానీ ఈరోజు విడుదలైన “ఎన్టీఆర్ బయోపిక్” సినిమాకు జూనియర్ రాకపోవడం మాత్రం పెద్ద లోటుగానే చెప్పుకోవచ్చు.
  •  
  •  
  •  
  •  
  •  
  •