పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘చంద్రముఖి’. ఈ సినిమా అప్పట్లో సంచలన హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రజినీకాంత్ , జ్యోతిక నటనలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. అయితే ఈ మధ్య ‘చంద్రముఖి-2’ సినిమాను ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే జ్యోతికను ‘చంద్రముఖి-2’ సినిమా గురించి అడగగా పలు ఆసక్తికర సమాధానం చెప్పింది.

చంద్రముఖి సీక్వెల్ గురించి తనను ఎవరు సంప్రదించలేదని అసలు ఆ సినిమా తీయబోతున్నారని నాకు అసలు తెలియదు అని చెప్పింది. కాగా ‘చంద్రముఖి’ లో గంగా, చంద్రముఖిగా రెండు విభిన్న పాత్రలు చేసి మెప్పించింది జ్యోతిక. ఇక ప్రస్తుతం జ్యోతిక.. ‘ఫోన్ మగళ్ వందాల్’ సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాను లాక్ డౌన్ కారణంగా మే 29న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయబోతున్నారు.

15 ఏళ్ళ యువతి సైకిల్ పై తన తండ్రితో 1200 కిమీ ప్రయాణం, పెద్ద సాహసమే

1230 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్