మన రాష్ట్రంలో కేఏ పాల్ తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కేఏ పాల్ ను ఈ మాట అడిగితే ఈ రాష్టమేమి కర్మ ప్రపంచంలో నేను తెలియని వారుంటారా అని ఎదురు ప్రశ్న వేస్తారు. అలాంటి కేఏ ప్రజాశాంతి పార్టీ పెట్టి గత నెలలో జరిగిన ఎన్నికలలో ఎంత హల్ చల్ చేసాడో తెలియంది కాదు. 175 స్థానాలు నేనే గెలవబోతున్నానని తాను చేసిన కామెడీతో మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో పాల్ సక్సెస్ అయ్యారు. కానీ తాను ఎంపీగా నిలబడిన నర్సాపురంలో మాత్రం డిపాజిట్ కోల్పోయాడు. 

అలాంటి పాల్ ఎన్నికలైపోయిన తరువాత మీడియాకు కనపడటమే మానేశారు. ప్రస్తుత సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హావ ఎంతలా నడుస్తుందో అందరకి తెలిసే ఉంటుంది. ఒక యువ సినీ దర్శకుడి కన్ను కేఏ పాల్ మీద పడిందట. కేఏ పాల్ బయోపిక్ తీస్తే మంచి వసూళ్లు సాధించవచ్చని అనుకున్నాడో ఏమో అనుకున్నదే తడవుగా సినిమా ముహుర్తాన్ని కూడా ఫిక్స్ చేసేసాడట. కేఏ పాల్ పాత్రను హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్న విషయం తెలియాల్సి ఉంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •