కేఏ పాల్ ఎప్పుడో 2009 ఎన్నికలలో హడావిడి చేసి మరల తిరిగి 10 సంవత్సరాల తరువాత రాజకీయాలలోకి తిరిగి అరగేంట్రం చేసిన ప్రజాశాంతి పార్టీ తరుపున రాజకీయాలు షురూ చేసాడు. ఇందులో భాగంగా కేఏ పాల్ పార్టీకి ఈసీ “హెలికాఫ్టర్” గుర్తుని కేటాయించింది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ హెలికాఫ్టర్ గుర్తుతో వైసీపీ నాయకులలో కొంచెం టెన్షన్ మొదలయింది. హిలికాఫ్టర్ గుర్తు, వైసీపీ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తుతో కొంత పోలి ఉండటంతో ఇప్పటికే వైసీపీ నాయకులు ఈసీ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు తెలుస్తుంది.

కేఏ పాల్ పార్టీకి చెందిన హెలికాఫ్టర్ గుర్తు తమ పార్టీకి చెందిన ఫ్యాన్ గుర్తు ఒకేలా పోలి ఉండటంతో, తమ పార్టీ ఓట్లు కొన్ని చీలి కేఏ పాల్ పార్టీకి పడే అవకాశం ఉందని, కేఏ పాల కు సంబంధించిన పార్టీ గుర్తుని మార్చి ఆ స్థానంలో వేరే గుర్తు ఇవ్వవలసిందిగా కోరారు. దీనిపై ఎన్నికల సంఘం పరీక్షించి త్వరలో ఒక నిర్ణయం చెబుతానని చెప్పినట్లు వినికిడి. గత ఎన్నికలలో తెలంగాణాలో కూడా కేసీఆర్ దాదాపుగా తమకు 100 సీట్లు వస్తాయని చెప్పగా 88 సీట్లతోనే టీఆర్ఎస్ పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దానికి కారణం టీఆర్ఎస్ పార్టీకి చెందిన “కారు” గుర్తుతో ట్రక్ గుర్తు పోలి ఉండటంతో ప్రజలు కొంత కన్ఫ్యూషన్ కు గురై ట్రక్ గుర్తుకు ఓటేయడంతో టీఆర్ఎస్ పార్టీకి ఓటింగ్ శాతంతో సీట్లలో కూడా కొత్త పడింది. టీఆర్ఎస్ పార్టీ ట్రక్ గుర్తుపై వెంటనే స్పందించి ఈసీకి పిర్యాదు చేయడంతో ఆ గుర్తుని ఇక నుంచి ఎన్నికలలో ఉపయోగించమని ఎన్నికల సంఘం తెలియచేసింది. వైసీపీ నాయకులు కూడా తమ అభ్యర్ధనను మన్నించి కేఏ పాల్ పార్టీకి చెందిన “హెలికాఫ్టర్” గుర్తు తొలగిస్తారని ఆశాభావంతో ఉన్నారు.