ఎన్నికలు ముగిసిన తరువాత కొంత రాజకీయాలలో స్థబ్ధత నెలకొండటం సర్వసాధారణం. ఎన్నికల సందర్భంగా ఇంటింటికి తిరిగి ఓట్ల కోసం అభ్యర్ధించిన నాయకులు, గెలిచిన పార్టీపైన ఆచితూచి విమర్శలు చేస్తూ దాదాపుగా ఒక ఏడాది పాటు సైలెంట్ గా ఉంటారు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అందుకు బిన్నంగా వైఎస్ జగన్ ప్రభుత్వం గెలిచిన తరువాత రోజు నుంచి ప్రతిపక్ష సభ్యులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నాయి. ఇక అందులో భాగంగా ఓడిన తెలుగుదేశం నాయకులు కూడా ఖాళీగా ఉండకుండా రాజకీయ నిరుద్యోగులుగా ఐదు సంవత్సరాలు భరించే శక్తీ లేక బీజేపీ లేదా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందులో భాగంగానే కాకినాడలో కాపు నాయకుల మీటింగ్ కొంత సంచలనం మారింది. ఇక నిన్న విజయవాడ చేరుకున్న బాబు ఈరోజు ప్రజావేదిక గురించి పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేసాడు. ఈ మీటింగ్ కు కాపు నాయకులు డుమ్మా కొట్టారు. వారిలో బోండా ఉమా, జ్యోతుల నెహ్రు, తోట త్రిమూర్తులు, పంచకర్ల రమేష్ బాబు లాంటి నాయకులు ఉన్నట్లు వినికిడి. వారంతా విజయవాడలోనే ఉండి పార్టీ సమావేశానికి డుమ్మాకొట్టారంటే తెలుగుదేశం పార్టీలో పెద్ద ప్రళయమే రాబోయే రోజులలో వచ్చేలా ఉంది. అసలుకే తెలుగుదేశం పార్టీకి ఆగష్టు సంక్షోభం ఉండనే ఉంది. ఇదంతా ఆగష్టు నెలకు ముందుగా జరుగుతుండటంతో, ఎన్టీఆర్ కుర్చీని అప్పట్లో చంద్రబాబు లాగేసుకునట్లు తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని బీజేపీ పార్టీ త్వరలో విలీనం చేసుకోబోతుందా అనేలా ఉంది.

రాజ్యసభ, లోక్ సభ, అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నేతలంతా బీజేపీలో చేరి విలీన ప్రక్రియ లెటర్ ఇస్తే తెలుగుదేశం పార్టీ నేరుగా చంద్రబాబుతో సంబంధం లేకుండా కోర్ట్ కేసులతో కూడా ఎటువంటి గొడవ లేకుండా విలీనం చేసేయవచ్చని చెబుతున్నారు. అది ఎంత వరకు నిజమనేది సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే తెలుస్తుంది. కానీ కాపు నాయకులంతా తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఇష్టపడటం లేదన్న వ్యాఖ్యలైతే బలంగా వినపడుతున్నాయి. కాపు నాయకులంతా బీజేపీలోకి  చేరి బీజేపీ పార్టీని కాపుల పార్టీగా ఏమైనా ప్రమోట్ చేస్తారేమో ముందు ముందు రోజులలో చూడాలి. 
  •  
  •  
  •  
  •  
  •  
  •