గత మూడు రోజులుగా జరుగుతున్నదంతా ఒక కల, మనం చూస్తున్నది అంత జగన్నాటకం… ఈ జగన్నాటకంలో పాత్రధారులెవరో, సూత్ర దారులెవరో తెలియదు గాని, ఈరోజు కోటంరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి బాయి బాయి చెప్పేసుకున్నారు. నా సొంత మేనత్త కొడుకు కాకాని గోవర్ధన్ రెడ్డి అని, మా ఇద్దరి మధ్య గొడవలెందుకున్నాయని, చిన్నప్పటి నుంచి కలసి మెలసి తిరిగామని, అన్ని విషయాలు ఇద్దరం కలసి నిర్ణయాలు తీసుకునే వాళ్లమని అంత మాది ఒక కుటుంబమని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.

ఈ మాటలన్నీ చెప్పడానికి ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి వీరిద్దరి గొడవ సర్ది చెప్పడానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. కాకాని, కోటంరెడ్డితో పాటు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా చర్చలలో పాల్గొన్నారు. అంత చర్చలు చేసుకొని మంచి వాతావరణంలో నాలుగు హాగ్ లు ఇచ్చుకొని బయటకు వచ్చి బాయి బాయి చెప్పుకున్నారు.

మరి మూడు రోజుల క్రితం కోటంరెడ్డి అరెస్ట్ అయిన రోజు నా అరెస్ట్ వెనక వెంకటాచలం వైసీపీ నేత ప్రదీప్ రెడ్డి ఉన్నాడని, అతడు కాకాని గోవర్ధన్ రెడ్డి అనుంగ అనుచరుడని, అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయించడనట్లు మాట్లాడారు. కానీ ఒక్కసారి బాస్ రంగంలోకి దిగాకా… కర్త కర్మ క్రియ అంత బాస్ చెప్పినట్లే జరగాలి. బాస్ చెప్పినట్లు బయటకు దోస్త్ మేర దోస్త్ చెప్పేసుకున్నారు. కానీ లోపల మాత్రం కారాలు మిరియాలు నూరుకోవడమే.. బయటకు గొడవ చల్లారినట్లు కనపడిందే గాని, లోపల మాత్రం నిప్పులు రాజేసుకోవడమే.. ఇంతకు మరి వీళ్లిద్దరు బాయి బాయి చెప్పుకున్నారు… వెంటాచలం ఎంపీడీఓ సరళ మీద కోటంరెడ్డి నిజంగానే దూషణలకు దిగితే ఆమె కేసు పెట్టిందా? లేక కోటంరెడ్డిని కావాలని ఇరికించారా అని అడిగితే మాత్రం ఇష్యూ క్లోజ్… ఇక ఎవరి పని వారు చూసుకోండి… గప్ చుప్