నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీష్ వేగేన్షా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రిన్ హీరోయిన్ గా నటిస్తుంది. బుధవారం ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు.