గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. సంగీతం కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకు గాను ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని సీఎం జగన్ లేఖలో కోరారు.

ఇక ఎస్పీ బాలసుబ్రమణ్యంకు సీఎం జగన్.. భారతరత్న ఇవ్వాలని కోరడంపై విలక్షణ నటుడు కమల్ హాసన్ స్పందించారు. ఎస్పీ బాలుకి సీఎం జగన్ భారతరత్న ఇవ్వాలని కోరినందుకు కమల్ ధన్యవాదములు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మన సోదరుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనదని.. సరైందని.. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారంటూ కమల్ హాసన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

హైదరాబాద్ లో సోను సూద్ కి ఘనమైన సత్కారం..!

పవన్ సినిమాల జాబితా పెరిగిపోతుంది.. కొత్తగా మరో సినిమా..!

గుడ్ న్యూస్.. రష్యా వ్యాక్సిన్ విజయవంతం.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు..!