కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి హిట్ సాధించింది. ఈ ఒక్క సినిమా విజయంతో మోస్ట్ వాంటెడ్ దర్శకుడుగా మారిపోయాడు లోకేష్. ఇక ప్రస్తుతం లోకేష్ దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘మాస్టర్’. కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర నిర్మాతలు.

ఇక ఈ సినిమా తరువాత లోకేష్ తీయబోయే సినిమాపై ఆసక్తి పెరిగింది. ఏ హీరోతో సినిమా తీస్తాడు అనేది ఆసక్తి కరంగా ఉంది. ఈ నేపథ్యంలో ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ తో తన తదుపరి సినిమాను ప్రకటించాడు లోకేష్. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ‘ఒకానొకప్పుడు ఇక్కడ ఘోస్ట్ నివసించేది’ అంటూ పోస్టర్ లో గన్స్ తో కమల్ చిత్రాన్ని డిజైన్ చేశారు. త్వరలో షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాను కమల్ హోమ్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషన బ్యానేర్ పై తెరకెక్కించనున్నారు. అనిరుద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాను 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలియచేసారు.

వైసీపీ ఎంపీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ..!

తూచ్ నాకు రియా చక్రవర్తికి ఎటువంటి సంబంధం లేదంటున్న ప్రముఖ హీరోయిన్

టార్గెట్ బచ్చన్ కుటుంబం, భద్రత మరింత కట్టుదిట్టం