గతంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీతో సంచలనం సృష్టించిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో మరో సంచలనానికి తెరతీశాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టైటిలే సాంగ్ లను రిలీజ్ చేసాడు వర్మ. ఇక ఈ సినిమాలో కులాల మధ్య గొడవ లేపడానికి వర్మ ప్రయత్నం చేస్తున్నాడంటూ వర్మపై కేసులు కూడా పెట్టారు.

ఇక ఈ సినిమాలో జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను పోలి ఉండే పాత్రలను రివీల్ చేసిన వర్మ తాజాగా ఈ సినిమాలో ఆలీ పాత్రను రీవీల్ చేశాడు. అలీ నటిస్తున్న పమ్మినేని రామ్ రామ్ అంటూ ఓ కొత్త క్యారెక్టర్ ను రీవీల్ చేశాడు. ఈ క్యారెక్టర్ స్పీకర్ చైర్ లోని పమ్మినేని రామ్ రామ్ ఎవరు అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దానికి రాంగోపాల్ వర్మే సమాధానం చెప్పాలంటూ నెటిజన్లు అడుగుతున్నారు.