బాలీవుడ్ సినీ పరిశ్రమకు డ్రగ్స్ కు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవినాభావ సంబంధం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సుశాంత్ మరణంతో మరోసారి డ్రగ్స్ మాఫియా గురించి నేషనల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. మూడుసార్లు జాతీయ అవార్డు గెలిచిన కంగనా రనౌత్ బాలీవుడ్ లో డ్రగ్స్ మాఫియా గురించి సంచలన నిజాలు చెబుతున్నారు. బాలీవుడ్ కు చెందిన 99 శాతం మంది సెలెబ్రేటిస్ డ్రగ్స్ లో మునిగితేలుతున్నారు. అసలు డ్రగ్స్ ను మంచి నీళ్లలా ప్రాయంగా ఉపయోగించడం బాలీవుడ్ లో సర్వసాధారణమైపోయిందని చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ లో సెలెబ్రెటీలుగా చెలామణి అవుతున్న వారి భార్యలు ఇచ్చే పెద్ద పెద్ద పార్టీలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అందుతాయని, పార్టీలకు ఆహ్వానం అందుకున్న వారు ఇలాంటి పార్టీలలో వ్యభిచార కార్యకలాపాలను పెంచి పోషిస్తుంటారని చెప్పుకొచ్చింది. అసలు బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యాపారం అంతా సెలెబ్రెటీల భార్యల కనుసన్నలలోనే జరుగుతుంది. వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదని, ప్రతి ఒక్కరి రక్త నమూనాలు తీసుకొని టెస్టులు చేస్తే ఎవరి బాగోతం ఏమిటో బయటపడుతుందని కంగనా రనౌత్ తెలియచేస్తుంది.

వీరికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతు విప్పి మాట్లాడితే పిచ్చెక్కిందని ముద్రవేస్తారని, తాను ముంబైలో ఉంటే ఇప్పటికే హత్యగావించబడేదానినని అందుకే తాను ముంబై వదిలి మనాలి వెళ్లిపోయానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రాచుర్యంగల డ్రగ్ కొకైన్ అని ఇది మీకు ఎక్కడ ఎప్పుడు ఎలా కావాల్సి వచ్చినా అందుబాటులో ఉంటుందని చెబుతుంది. బాలీవుడ్ లో తాము బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటామని ముందుకొచ్చే ప్రతి ఒక్కరకి డ్రగ్ టెస్టులు చేసి వారి వ్యవహారం తేల్చి అప్పుడు అంబాసిడర్లుగా పెట్టుకోవాలని, ప్రభుత్వం కూడా దీనికి నిర్దిష్ట పరిమితులు పెట్టాలని చెబుతుంది.

బాలీవుడ్ లో డ్రగ్స్ వాడుతున్న వారి వ్యవహారం మొత్తం నాకు తెలుసని, ఒకఇంట్లో డ్రగ్స్ తీసుకున్న తరువాత మరొక ఇంటికి చేరి అక్కడ వ్యభిచార పనులకు దిగుతారని, సుశాంత్ సింగ్ చనిపోవడానికి అతడి కుంగుబాటు కారణం అని నేను అనుకోవడం లేదని, దీని వెనుక డ్రగ్స్ మాఫియా హస్తం కూడా ఉండే ఉంటుందని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో బిలియన్ డాలర్ల కొద్ది కుప్పలు తెప్పలుగా డబ్బు మూలుగుతుందని, వారు దీనిని ఉపయోగించి న్యాయవ్యవస్థనే ప్రభావితం చేయగలరని, మన అందరం కలసి బాలీవుడ్ నుంచి డ్రగ్స్ ప్రారదోలడానికి మనవంతు కృషి చేద్దామని కంగనా రనౌత్ చెప్పుకొస్తుంది.

నొప్పి లేకుండా సూది మందు అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు

కొడుకు పేరిట గంజాయి పార్సిల్, కంగుతిన్న తండ్రి