బేసిక్ గా కంగనా ఎవరికైనా చుక్కలు చూపిస్తుంది తప్ప కంగనా ఇలాంటి చిన్నా చితక బెదిరింపులకు ఎప్పుడు భయపడే అవకాశం లేదు. కానీ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు కంగనా అడ్డంగా దొరికిపోవడంతో అతడిని బెదిరించాలని చూసి చివరకు ఆమె వెనక్కు తగ్గి తన ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్స్ డిలేట్ చేసుకుంది. ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో కంగనా చెబుతూ తాను గత ఎన్నికలలో బీజేపీ పార్టీకి కాకుండా శివసేన పార్టీకి ఓటు వేశానని, బలవంతంగా నాతో శివసేనకు ఓటు వేయించారని, తమ కుటుంబసబ్యులం అందరం శివసేనకు ఓటు వేశానని కానీ ఇప్పుడు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు.

అసలు కంగనా రనౌత్ ను బెదిరించి ఆమె చేత ఓటు వేయించే సీన్ ఎవరికైనా ఉందంటారా? కానీ కంగనా అలా చెప్పడంతో ఆ జర్నలిస్ట్ లేవనెత్తిన ప్రశ్నకు కంగనా బిత్తర చూపులు చూసింది. 2019 లో జరిగిన ఎన్నికలలో బీజేపీ-శివసేన కలసి పోటీ చేశాయి. కంగనా రనౌత్ కు బాంద్రా వెస్ట్ నియోజకవర్గంలో ఓటు ఉంది. అక్కడ పార్లమెంట్, అసెంబ్లీ రెండు సీట్లు పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది. అలాంటప్పుడు శివసేనకు కంగనా ఎలా ఓటు వేస్తుందని ప్రశ్న లేవనెత్తడంతో కంగనా కంగుతినంత పనైంది.

దీనితో కంగనా అతడిపై విరుచుకుపడుతూ నువ్వు ఒక ట్రోల్ చేసే వాడివని, నీ సంగతి చూస్తానని అతడిపై చిందులు శివాలు తొక్కింది. దీనితో అతడు కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నేను ఒక జర్నలిస్ట్ ను అని తాను ఒక అనామక ట్రోల్ర్ ను కాదని, నీ బెదిరింపులకు, నీ ఉడతా ఊపులకు ఎవరు బెదిరిపోయేవారు లేరని, తాను అడిగిన దానికి సమాధానం చెప్పాలని కోరడంతో కంగనా కంగుతిని తాను అతడిని బెదిరిస్తూ పెట్టిన ట్వీట్స్ డిలీట్ చేసుకోవడం జరిగింది. ఇలా కంగనా ఒక జర్నలిస్ట్ ను బెదిరించడంతో ముంబై ప్రెస్ క్లబ్ అసోసియేషన్ రంగంలోకి దిగి జర్నలిస్ట్ లను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని ఆమెకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇలా కంగనా రనౌత్ తనపై మరింత సింపతీ తెచ్చుకోవడానికి ఉన్నవి లేనట్లు కట్టు కథలు అల్లి ఇలా అడ్డంగా దొరికిపోతుంది.