ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కోడలు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. కన్నా చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మీనాక్షి టవర్స్ లో గురువారం సాయంత్రం ఆమె అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

శుక్రవారం ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఆమె మృతికి గల కారణాలు తెలియనున్నాయి. సుహారిక తల్లి పిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా అపోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణాలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా మరో 117 పాజిటివ్ కేసులు..!

చిరంజీవి కావాలనే బాలకృష్ణను పిలవలేదా? టిట్ ఫర్ ట్యాట్