సీఎం వైఎస్ జగన్ ఈ వారంలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో పాటు, హోమ్ మంత్రి అమిత్ షాతో కీలక చర్చలు చేసి వచ్చారు. ఈ చర్చలలో భాగంగా రాజధాని వికేంద్రీకరణ, పోలవరం, ప్రాజెక్ట్ ఇలా తదితర అంశాలపై చర్చలు సాగించడంతో పాటు రాబోయే రోజులలో ఎన్డీఏలో వైసీపీ చేరికకు సంబంధించి కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. దీనిపై ఈరోజు ఉదయం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మోదీ, అమిత్ షాతో సీఎం జగన్ చర్చలు పాలనా సంబంధమైనవని తెలియచేయడం జరిగింది.

దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తాము టీడీపీ, వైసీపీ ఆప్ర్తిలతో సమానదూరం మైంటైన్ చేయాలనుకుంటున్నట్లు తమ పార్టీ విధానమని, బొత్స ఎందుకు అలా మాట్లాడుతున్నారో తనకు అర్ధం కావడం లేదని తెలియచేసారు. వైసీపీ పార్టీ బీజేపీతో కలసి పనిచేయాలన్న విషయం తమకు సమాచారం లేదని తెలియచేసారు. గత కొద్ది రోజులుగా వైసీపీ పార్టీ అధినేత సీఎం జగన్ పై లేనిపోని విమర్శలకు దిగుతునం కన్నా లక్ష్మీనారాయణకు ఇలా బీజేపీ – వైసీపీ కలసి పనిచేయడం మింగుడు పడుతున్నట్లు లేదు.