ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికి నిలిచిపోయే పేరు కపిల్ దేవ్. 1983లో ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించాడు. తాజాగా కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ’83’. కపిల్ దేవ్ సాధించిన విజయాల్ని ఈ సినిమాలో తెరకెక్కిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో బాలీవుడ్ క్రేజి హీరో రణబీర్ సింగ్ ఈ సినిమాలో కపిల్ దేవ్ గా నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్ వచ్చింది.

ఈ సినిమా మార్చిలోనే విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ప్రముఖ ఒటిటి అమెజాన్ నుండి ఈ బయోపిక్ కు భారీ ఆఫర్ వచ్చింది. ఇప్పటికే అమెజాన్ తో చర్చలు కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే ఈ సినిమాను అమెజాన్ లో విడుదల చేయబోతున్నారట. అయితే ఈ బయోపిక్ థియేటర్లలో విడుదల చేస్తేనే ప్రేక్షకులను 80 నాటి కాలంలోకి తీసుకెళ్లొచ్చన్న ఉద్దేశంతో నిర్మాతలు ఇప్పటిదాకా వేచి చూసారు. కానీ కరోనా వైరస్ ఇప్పట్లో తగ్గేలా లేకపోవడంతో ఒటిటి వైపు మొగ్గు చూపారు.

15 మంది మహిళల దగ్గర అక్షరాలా 4 కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన ఘరానా మోసగత్తె

పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం దిమ్మతిరిగిపోయిందిగా

ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చట..!