తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పీకల్లోతు కష్టాలలో మునిగిపోయింది. అసెంబ్లీలో దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడు ప్రతిపక్ష హోదా కోల్పోవలసి వస్తుందా అన్నట్లు బండి లాక్కొస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ సభ్యులు బీజేపీలో చేరడంతో కాపు నేతలు అలెర్ట్ అయ్యారు. వారు కూడా కాకినాడ వేదికగా సభలు సమావేశాలు అంటూ మీటింగ్స్ పెట్టి హడావిడి చేసారు. 

చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ బాబుతో తెలుగుదేశం పార్టీని లాక్కురావడం కష్టమైన పనే. ఇక చంద్రబాబు నాయుడుకి వయస్సు మీద పడుతుంది. ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీని కాపులు తమ ప్రాబల్యం పెంచుకొని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే కాపు నేతలు చంద్రబాబు నాయుడుని కలసి… లోకేష్ బాబు మీద ఆరోపణలు చేసి… మా మీద పెత్తనం చేస్తే సహించేది లేదని సున్నితంగా హెచ్చరిక పంపినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా కాపు నేతల డిమాండ్ కు తలొగ్గి కోరిన కోర్కెలు తీర్చేందుకు సిద్ధమయ్యారట. 

చంద్రబాబు నాయుడు కూడా కాపులను వదులుకొని మరో తప్పు చేయడానికి సిద్ధంగా లేరు., వారికి పార్టీలో కీల పదవి అప్పగించి తగిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారట. ఇప్పటికే బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరమవ్వగా… గతంలో కాపు నాయకుడు ముద్రగడపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన కక్షపూరితమైన అరెస్ట్ తో పాటు… వారి కుటుంబాన్ని నిర్బంధించి హింసించడం కూడా కాపు కులానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పరిణామాలన్నీ అధిగమించాలంటే కాపులను మరోసారి మచ్చిక చేసుకొని అందలం ఎక్కించడమే పరిష్కారమని బాబు భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో కాపు నేతలు కూడా ప్రస్తుతానికి బీజేపీకి వెళ్లకుండా ఇక్కడ పార్టీ పరిస్థితులు చూసి భవిష్యత్ కార్యాచరణ కోసం మరోసారి భేటీ అవుతారని చెబుతున్నారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •