బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని ముంబై తన నివాసంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి తరువాత బాలీవుడ్ లో డ్రగ్ కేసు తెరపైకి వచ్చింది. అనేక మంది నటులు బాలీవుడ్ లో డ్రగ్స్ వాడతారంటూ పేర్లు బయటకి వచ్చాయి. ఇక ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్, దీపికా పదుకునే లను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఇదే కోవలో ఇంకా పలువురు నటులను ఎన్‌సీబీ విచారించబోతుంది.

ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్ కేసులో తాజాగా ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ పేరు తెరమీదకు వచ్చింది. ఇద్దరు డ్రగ్ సరఫరాదారులకు కరణ్ జోహార్ కు సంబంధం ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. గత ఏడాది జులై 28న కరణ్ ఇంట్లో డ్రగ్స్ వాడినట్లుగా వార్తలు వచ్చాయి. డ్రగ్స్ సరఫరాదారులుగా ఎన్‌సీబీ గుర్తించిన క్షితిజ్ ప్రసాద్, అనుభవ్ చోప్రాలు కరణ్ కు అత్యంత సన్నిహితులని మీడియాలో కథనాలు రావడం కలకలం రేపింది.

ఇక ఈ వార్తలపై తాజాగా స్పందించాడు కరణ్ జోహార్. ఆ ఇద్దరితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. క్షితిజ్ ప్రసాద్ మా సంస్థలో ఓ ప్రాజెక్ట్ కోసం గత ఏడాది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాడని చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని.. అంతకుమించి ఆ వ్యక్తులతో వారి వ్యక్తిగత జీవితాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. ఇక తన ఇంట్లో జరిగిన పార్టీలో కూడా అసలు ఎలాంటి డ్రగ్స్ వాడలేదని కరణ్ జోహార్ తెలియచేసాడు.

కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన.. రాబోయే ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉంది..!

తండ్రికి అనారోగ్యం.. ఐపీఎల్ కి దూరం కానున్న స్టార్ ప్లేయర్..!

రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి పబ్‌జీ..!