తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ రెండవ వారం పూర్తి చేసుకోబోతుంది. బిగ్ బాస్-4 నుండి మొదటివారం దర్శకుడు సూర్య కిరణ్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక బిగ్ బాస్ రెండవ వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారని నాగార్జున ప్రకటించాడు. ఇక అందరూ ఊహించినట్లుగానే కరాటీ కళ్యాణి ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించాడు.

ఇక బిగ్ బాస్ రెండవ వారంలో తొమ్మిది మంది ఎలిమినేషన్ కి నామినేషన్ అయ్యారు. సెల్ఫ్ గా ఎవరికి వారు ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. అయితే సెల్ఫ్ ఎలిమినేషన్ పై నాగార్జున మండి పడ్డారు. ఆడటానికి వచ్చారా.. వెళ్లిపోవడానికి వచ్చారా.. ఆటను సీరియస్ గా తీసుకోవడం లేదని మండి పడ్డారు. ఇక హీరో, జీరో ఎపిసోడ్ తరువాత నాగార్జున.. సస్పెన్సు లేకుండా కరాటీ కళ్యాణి ఎలిమినేట్ అయినట్లు తేల్చి చెప్పాడు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్యేగానికి గురైంది. ఇక రెండవ ఎలిమినేషన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈవారం సెకండ్ ఎలిమినేషన్ ఎవరనేది తెలియాలంటే రేపటివరకు ఆగాల్సిందే.

ఈ పుష్పంతో ఏ వ్యాధినైనా నయం చేయవచ్చట..!

టబు పాత్రలో తమన్నా..!