కరివేపాకు కూరలలో ప్రతి ఒక్కరు ఉపయోగిస్తారు. కరివేపాకుని కస్టపడి కొనుక్కొచ్చి కూరలలో వాడతారు తప్ప దానిని తినకుండా పక్కన పడేస్తారు. సువాసన కోసమే కరివేపాకును వాడుతామని చెప్పేవారు ఉన్నారు. కానీ కరివేపాకు ఉపయోగాలు తెలిసిన వారు ఎవ్వరు కరివేపాకును పక్కకు తీసి వేసే సమస్యే లేదు. కరివేపాకులో ఉన్న ప్రయోజన వలన క్యాన్సర్ నియంత్రించడంలో బేషుగ్గా పనిచేస్తుంది. కరివేపాకులో యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది.

కరివేపాకు రక్తంలోని కొవ్వుని కరిగిస్తుంది. కరివేపాకులో ఎమినో యాసిడ్స్ ఉండటం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకును ప్రతిరోజు తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కరివేపాకు రోజు తీసుకోవడం వలన మీ జుట్టు తెల్లబడకుండా నల్లగా ఉండేందుకు సహాయ పడుతుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు ఆకులు వేసి మరిగించి రోజు తలకు రాసుకుంటే మీ కుదుళ్ళు మరింత దృడంగా మార్చడంతో పాటు తెల్ల వెంట్రుకల బాధ నుంచి తప్పించుకోవచ్చు.