కరివేపాకు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నా… మనం తినేటప్పుడు కూరలో వచ్చే కరివేపాకును తీసి పక్కన పడేస్తుంటాం. అందుకే “కూరలో కరివేపాకు” అనే సామెత కూడా ఉంది. కరివేపాకులో ఎమినో యాసిడ్స్ ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కరివేపాకులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ గుండె సంబంధిత వ్యాధులను నయం చేస్తాయి. ఇది రక్తంలోని కొవ్వుని కరిగించడానికి బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు రెగ్యులర్ గా తీసుకోవడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుందని చెబుతున్నారు.

కరివేపాకును ఎక్కువగా వాడటం వలన క్యాన్సర్ ను నియంత్రించడంలో బేషుగ్గా పనిచేస్తుందట. మధుమేహాన్ని నియంత్రించుకోవాలంటే కరివేపాకు పొడిని మీరు తినే అన్నంలో మొదటి ముద్దగా తీసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కర స్థాయిని తగ్గించడంలో కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. కరివేపాకు మన శరీరంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

జుట్టు రాలడం,, చుండ్రు సమస్యలకు కూడా కరివేపాకు మంచి ఔషధంగా పని చేస్తుంది. శ్వాసకోస సంబంధిత వ్యాధులు, మలబద్దకం, అర్షమొలలు సమస్య తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కరివేపాకు వలన ఇన్ని ఉపయోగాలు ఉండటంతో కూరలో నుంచి పక్కన పెట్టకుండా కరివేపాకును తిని మీ ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోండి.