చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ముందు దేశవ్యాప్తంగా తిరుగుతూ అంతా తానే నడిపిస్తున్నానని… మోదీ ప్రభుత్వాన్ని కూలదోసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరిని తానే దగ్గర చేస్తున్నట్లు ఢిల్లీ నుంచి కోల్ కత్తా వరకు నలుదిక్కుల తిరిగుతూ తన చేతిలోనే అసలైన చక్రం ఉందని ఇచ్చిన బిల్డ్ అప్ తరువాత వచ్చిన… ఎన్నికల ఫలితాలలో అసలు పత్తా లేకుండా పోయారు.

చంద్రబాబు నాయుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో కూడా ఎన్నో మంతనాలు చేసారు. గత సంవత్సరం కర్ణాటకలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూడా బాబు కొన్ని చోట్ల ప్రచారం చేసారు. ఆ సమయంలో తెలుగుతమ్ముళ్లు కర్ణాటకలో చంద్రబాబు కీలకంగా మారారని… బాబు చాణిక్యం వలనే కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అవ్వగలిగాడని చెప్పుకొచ్చారు.

అంతలా కుమారస్వామి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చంద్రబాబు నాయుడు… కర్ణాటకలో ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి జెడిఎస్ – కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతుంటే చంద్రబాబు నాయుడు ట్రబుల్ షూటర్ లా ఎందుకు ఆ ప్రభుత్వాన్ని కాపాడే పనిచేయలేకపోతున్నారు అంటే… దానికి సమాధానమే లేదు. 

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు… ప్రధాని అవుతాడని తన మీడియా గొట్టాలతో డబ్బాలు కొట్టించుకున్న చంద్రబాబు… ఇప్పుడు జేడీఎస్ – కాంగ్రెస్ నేతలను పిలిపించుకొని ఎందుకు మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబుకి అనుకూలంగా ఉంటే ట్రంప్ ను కూడా తానే గెలిపించానని డబ్బా కొట్టుకుంటారని… తనకు అనుకూల రాజకీయాలు ప్రస్తుత సమయంలో లేకపోవడంతోనే తన మీడియా గొట్టాలు కూడా మూగబోయి డబ్బా కొట్టడం మానేశాయి.
  •  
  •  
  •  
  •  
  •  
  •