కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా మద్యం షాపులు మూసివేశారు. అయితే సోమవారం నుండి పలు రాష్ట్రాలలో మద్యం షాపులు ఓపెన్ చేయడంతో మందు బాబులు భారీ ఎత్తున మద్యం కోసం షాపుల వద్దకు చేరుకున్నారు. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. అయితే కర్ణాటకలో కోలారులో మద్యం ఏరులై పారింది. మద్యం పీకల దాకా తాగిన ఓ మందుబాబు మద్యం మత్తులో బైక్ కు అడ్డుగా వచ్చిన పామును పట్టుకుని దానిని కొరికి కొరికి తిని చంపాడు. ఇక ఆ ఘటన సూచిన వారందరు షాకుకు గురయ్యారు. పామును చూస్తేనే హడలిపోయే జనం మద్యం తలకెక్కగానే అది పామో లేక చికెనో తెలుసుకోలేనంతగా మారిపోయాడు.

నిర్మాణ రంగంలో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగించే కుమార్ అనే వ్యక్తి మంగళవారం రోజున కావాల్సినంత మద్యం కొనుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇక మద్యాన్ని ఫుల్లుగా సేవించిన కుమార్.. బైక్ మీద వెళ్తుండగా పాము అడ్డుగా రావడంతో దానిని పట్టుకుని కొరికి కొరికి తిని చంపాడు. దీంతో ఆ పాము అక్కడికక్కడే చనిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో రావడంతో వైరల్ గా మారింది.