కరోనా వైరస్ అనేక దేశాలను ముప్పుతిప్పలు పెట్టినా ఇప్పుడు వైరస్ తగ్గుముఖం పట్టి చాలా దేశాల సాధారణ జీవితాన్ని గడుపుతున్నాయి. అమెరికాలో కూడా ఒకానొక సమయంలో అత్యంత భయంకరంగా విజ్రంభించిన వైరస్ ఇప్పుడు తగ్గుముఖం పట్టడం తో రాబోయే రెండు నెలలో పూర్తిగా వైరస్ అంతమొందుతుందని వైరస్ చాలా వీక్ అయిపోయిందని చెబుతున్నారు.

కానీ మన భారత్ లో మాత్రం వైరస్ రోజు రోజుకి పెరగడమే తప్ప తగ్గుముఖం కనపడటం లేదు. ప్రతి రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతూ ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రజలంతా లాక్ డౌన్ ఎత్తేయడంతో బయటకు రావడంతో పాటు కొంతమంది ప్రయాణాలలో కూడా వైరస్ కొనితెచ్చుకుంటున్నట్లు కనపడుతుంది. రోజుకి లక్ష కేసులను టచ్ చేసేలా వెయ్యి మరణాలకు ప్రతిరోజు తగ్గకుండా వస్తుంటే మన దేశంలో ప్రజలు వ్యాక్సిన్ పై ఆశగా ఎదురు చూస్తున్నారు. మన దేశంలో పల్లెలకు వైరస్ పాకడంతో అక్కడ మరింత విజ్రంభిస్తుండటంతో అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు తగ్గుముఖం పట్టించడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సఫలం కాలేకపోతుంది. అందుకే రష్యాకు చెందిన “స్నూత్నిక్ వీ” వ్యాక్సిన్ పై ఎంక్వయిరీ మొదలు పెట్టి తమకు వైరస్ డీటెయిల్స్ కావాలని అడిగినట్లు తెలుస్తుంది. వైరస్ కనుక తగ్గుముఖం పట్టకపోతే రాబోయే చలికాలంలో వైరస్ వ్యాప్తి మరింత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.