సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న రఘు కుంచె.. ఇప్పుడు ఆర్టిస్టుగా బిజిగా మారాడు. ఇటీవల ఆయన నటించిన ‘పలాస 1978’ సినిమా ఆయన నటనకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు తాజాగా ఆయన మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. 1991 లో రాజీవ్ గాంధీని దారుణంగా హత్యచేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో ‘కథా నళిని’ అనే సినిమా తెరకెక్కుతుంది.

కొత్త దర్శకుడు కొక్కిరిగడ్డ మహేంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ గాంధీ హత్య కేసులో మొదట్లో మరణశిక్ష పడి, ఆ తరువాత అది యావజ్జీవ శిక్షగా మారడంతో జైలు జీవితాన్ని గడుపుతున్న ప్రధాన దోషులలో ఒకడైన మురుగన్ పాత్రను ఈ చిత్రంలో రఘు కుంచె పోషిస్తున్నారు. ఇక ఇదే కేసులో గత 29 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ముగుగన్ భార్య నళిని పాత్రలో ఓ ప్రముఖ నటి నటిస్తుంది. రాజీవ్ గాంధీ హత్యకుట్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోగో బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

బ్రేకింగ్: కరోనా వైరస్ తో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి..!

ఏపీ ఆర్టీసీలో కీలక పరిణామం.. బస్సు కండక్టర్లకు కొత్త ఉద్యోగం..!