కరోనా వైరస్ తో సుదీర్ఘకాలం ఉండే రోగమని, దానితో కలసి సహజీవనం సాగించక తప్పదని అది జ్వరం వంటిదేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ మధ్య వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ విమర్శలు గుప్పించారు. కాగా తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్.. జగన్ చేసిన వ్యాఖ్యలనే సమర్ధించారు.

కరోనా వైరస్ అనేది రేపు, ఎల్లుండో పోయే సమస్య కాదని.. కొంత కాలం పాటు దీనితో సహజీవనం సాగించక తప్పదని అన్నారు. ఈ కరోనా వైరస్ తో ప్రజలు కలసి జీవించాల్సిందేనని అన్నారు. ఇక అవే వ్యాఖ్యలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా వ్యాఖ్యానించారు. కరోనా తో కాపురం చేయాల్సిందేనని అందుకు రాష్ట్రప్రజలంతా సిద్ధంగా ఉండాలని తెలియచేసారు.

తెలంగాణ నుండే కరోనా వైరస్ వ్యాక్సిన్..!

వైసీపీలో చేరికపై సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు..!

గుడ్ న్యూస్.. కరోనాను అడ్డుకునే యాంటీబాడీ గుర్తింపు..!