వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఎప్పుడైతే చర్చలు చేసిందో, అప్పటి నుంచి తెలుగుదేశం నేతలకు మింగుడు పడటం లేదు. వైఎస్ జగన్, కేటీఆర్ కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వైఎస్ జగన్ తో చర్చలు చేస్తారని, ఆ చర్చలు కూడా అమరావతి వేదికగా ఉంటాయని చెప్పడంతో టీడీపీ శ్రేణులను వారి నెత్తిపై పెద్ద పిడిగి పడినట్లయింది.

వైఎస్ జగన్ అమరావతి వేదికగా రాజకీయాలు చేయాలన్న తలంపుతో అమరావతి ప్రాంతంలో ఇంటి నిర్మాణం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంటి నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తి కాగా, గృహ ప్రవేశానికి ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేశారట. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 14వ తారీఖున వైఎస్ జగన్ తన కొత్త ఇంటిలోకి అడుగుపెట్టనున్నారు. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావాలని నిర్ణయించుకున్నారు. ఇదే సందర్భంలో ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన చర్చలు కూడా జరగనున్నాయని వైసిపి వర్గాల ద్వారా తెలుస్తుంది.

Ys_Jagan_KTR

ఇప్పటికే కేసీఆర్ ఫోన్ లో వైఎస్ జగన్ తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కేసీఆర్ కూడా తాను గెలిచిన తరువాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ త్వరలో చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొనడంతో, ఇప్పుడు కేసీఆర్ అమరావతి వెళ్లి ఏపీ ప్రతిపక్ష నేతతో చర్చలు జరపాలని అనుకోవడం కూడా టీడీపీ సబ్యులకు మింగుడుపడకపోవడంతో పాటు, రిటర్న్ గిఫ్ట్ కూడా వైఎస్ జగన్ తో చర్చలు జరిపి, అమరావతి సాక్షిగా కేసీఆర్.. చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహాన్ని ఏపీ ప్రజలకు తెలియచేస్తాడని అంటున్నారు. చూద్దాం కేసీఆర్ అమరావతి వచ్చి ఎన్ని సంచలనాలు సృష్టిస్తారో. వైఎస్ జగన్ ఈరోజు నుంచి ఐదు రోజుల టూర్ కోసం లండన్ వెళుతుండటంతో తిరిగి వచ్చిన తరువాత తెలుగుదేశం శ్రేణులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది.