తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టాన్ని శాసనమండలిలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా దీనిపై మాట్లాడిన కేసీఆర్.. ఇకపై రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవినీతికి ఆస్కారం ఉండబోదని.. సబ్ రిజిస్టార్లకు ఎలాంటి విచక్షణాధికారం లేదని స్వష్టం చేశారు. ఇక పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతాయని.. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ధరణి పోర్టల్ల్లో అప్డేట్ కాగానే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, ఆప్‌డేషన్ కాపీలు వస్తాయన్నారు.

రెవెన్యూ కోర్టులను రద్దు చేసామన్న కేసీఆర్.. వివాదాల పరిష్కారానికి కోర్టులకు వెళ్ళవచ్చన్నారు. కానీ కావాలని వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృధా చేయదన్నారు. బయోమెట్రిక్, ఐరిస్,ఆధార్, ఫొటోతో రిజిస్ట్రేషన్ పక్రియ చేపడతామని.. ఈ వివరాలన్నీ లేకుండా తహసీల్దార్లకు పోర్టల్ కూడా తెరుచుకోదని చెప్పారు. ప్రజలుకు లంచాలు ఇచ్చే భాద తప్పాలనే తమ ప్రభుత్వ ఉద్దేశమని సీఎం కేసీఆర్ తెలియచేసారు.

చిక్కుల్లో స్టార్ హీరో.. కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడ్డారంటూ హైకోర్టు జడ్జి ఆగ్రహం..!

సెప్టెంబర్ 23 నుండి ‘వకీల్ సాబ్’..!

బిగ్ బాస్ నుండి ఒకరు అవుట్ ఒకరు ఇన్..!