తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఓ సలహా ఇచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు జగన్ దూరంగా ఉండాలని.. అసలు కేసీఆర్ తో కలవద్దని సూచించారు. ఇలాంటి కార్మిక వ్యతిరేకి ఇద్దరు ఆర్టీసీ కార్మికులు చావడానికి కారణమైన కేసీఆర్ కి జగన్ దూరంగా ఉండాలని లేకపోతే ఆయనకున్న మంచి పేరు చెడిపోతుందన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలు కేసీఆర్ పట్టించుకోవటం లేదని.. ఆర్టీసీ కార్మికులు బలి దానాలు చేసుకున్నా కనీసం పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇలాంటి దుర్మార్గులతో కలిస్తే మీ పేరుతో పాటు మీ నాన్న గారు రాజశేఖర్ రెడ్డి గారు పేరు కూడా చెడిపోతుందన్నారు. ఏపీలో లోటు బడ్జెట్ ఇక్కడ మిగులు బడ్జెట్ ఉందని.. కానీ ఏపీలో జగన్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలు జగన్ పడిన కష్టంతో అధికారంలోకి వచ్చారని.. కనీసం కేసీఆర్ తన బిడ్డను గెలిపించుకోలేకపోయారని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.