‘మహానటి’ ఫేం కీర్తి సురేష్ హిందీలో ఓ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుంది. ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ లైఫ్ స్టోరీ ను బేస్ చేసుకొని తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ కథానాయకుడిగా నటించనున్నారు. పిరియాడికల్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది.

‘బడాహీ హో’ ఫేమ్ అమిత్ షా డైరెక్ట్ చేయనున్నఈ సినిమా జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనికపూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.