అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి గత ఏడాది ఫిబ్రవరిలో ప్రమాదవశాత్తు మరణించి షాక్ కు గురిచేసింది. ఆమె మరణం పట్ల అప్పట్లో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ చివరిగా ప్రమాదవశాత్తునే మరణించిందని తేల్చి కేసు కొట్టివేశారు. శ్రీదేవి చనిపోయిన దగ్గర నుంచి ఎక్కడో ఒకచోట అభిమానులు, సినిమా సెలెబ్రేటిస్ ఇలా చాల మంది ఆమెది సహజం మరణం కాదని వాదిస్తూనే ఉన్నారు.

తాజాగా కేరళ జైళ్ల డీజీపీ రిషిరాజ్… అందల తార శ్రీదేవి మరణంపై సంచలన విషయాలు చెప్పారు. కేరళలో ప్రచురితమయ్యే కౌముది అనే పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీదేవి బాత్ టబ్ లో పడి చనిపోలేదని హత్యచేయబడిందని… తన మిత్రుడు ఫోరెన్సిక్ సర్జన్ డాక్టర్ ఉమాదత్తన్ చెప్పాడని అన్నారు. ఇంకా వివరాలు చెబుతూ ఒకవేళ శ్రీదేవి అతిగా మద్యం తాగిన ఆమె ఒక అడుగు నీళ్లలో పడి చనిపోయే ప్రశ్నే లేదని… ఎవరో వెనక నుంచి తోస్తే తప్ప ప్రమాదం జరగదని… ఒక అడుగు నీటి టబ్బులో పడి చనిపోవడమన్నది జరిగే పని కాదని అన్నారు. జైళ్ల శాఖ డీజీపీనే ఇలా చెప్పడంతో ఏదో అనుమానం దాగి ఉందని అభిమానులు భావిస్తున్నారు.  
  •  
  •  
  •  
  •  
  •  
  •