ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ పార్టీ వాళ్లు దాడి చేయాలనుకుంటే సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో చేయరన్నారు. జగన్ పాదయాత్రలోకే టీడీపీ కార్యకర్తలు వెళ్లి రోడ్డు మీదే జగన్‌ను కైమా కైమాగా చేసే వారంటూ అహంకారపూరిత వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌ జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి రాదన్న ఆయన.. పాదయాత్రలో జగన్‌కు ఎక్కడా కూడా జనాదరణ రావడం లేదన్నారు.

యాత్ర ముగింపు దశకు వచ్చినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సానుభూతి కోసం సొంత మనిషితో ఎయిర్‌పోర్టులో జగనే దాడి చేయించుకున్నారని నాని ఆరోపించారు. అసలు ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్రలో జగన్‌ ఎప్పుడో అయిపోయేవారని ఆయన వ్యాఖ్యానించారు. కాగా నిన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే వైఎస్‌ జగన్‌ హత్యకు తాము ప్లాన్‌చేస్తే పిల్ల కుంకతో ఎందుకు చేయిస్తామని.. భారీస్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు.