గత కొన్ని రోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వార్తలలో హైలైట్ అవ్వుతున్న విషం తెలిసిందే. సొంత పార్టీ నాయకులపైనే కాకుండా ఇతర పార్టీ నాయకులపై కూడా నాని విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఆయన కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు చేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీలు కిరాయి పార్టీలుగా మారిపోవడం వల్లే ఈ రోజు దేశంలో ఆ పార్టీలు కనుమరుగై పోయాయని కమ్యూనిస్టు పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేశినేని నాని.

కాగా కేశినేని ట్రావెల్స్ కి సంబంధించిన ఉద్యోగులు వెంటనే పాత బకాయలు చెల్లించాలని శుక్రవారం నిరసన దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు స్థానిక కమ్యూనిస్టు పార్టీ మద్దతు తెలిపింది. ఈ నేపథ్యంలో నాని కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు గుప్పించారు. కాగా నాని చేసిన ఈ వ్యాఖ్యలపై కమ్యూనిస్టులు భగ్గుమంటున్నారు. ఆయన తక్షేణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి శంకర్.
  •  
  •  
  •  
  •  
  •  
  •