ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా రూపొందిన ‘కేజిఎఫ్ చాప్టర్ 1’ సినిమా అంచనాలకు మించి బారి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాలో హీరో పాత్రతో పాటు, విలన్ క్యారెక్టర్స్ కూడా అద్భుతంగా పండాయి. క్రూరమైన విలన్ గా చూపించడంలో దర్శకుడు సక్సెస్ అవ్వడమే కాకుండా కొత్త చాప్టర్ కు పునాదులు వేశాడు. కానీ ‘కేజిఎఫ్ చాప్టర్ 1’లో విలన్ క్యారెక్టర్ ‘గరుడ’ తక్కువగా నిడివి ఇచ్చారు.

ఇప్పుడు రాబోయే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’లో విలన్ క్యారెక్టర్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ రంగం సిద్ధం చేసుకున్నాడు. అందులో భాగంగా 5 గురు విలన్స్ ఉండనున్నట్లు తెలుస్తుంది. అందులో మెయిన్ విలన్ గా ‘ఆదిరా’ క్యారెక్టర్ లో సంజయ్ దత్ ను తీసుకోవడం జరిగింది. సంజయ్ దత్ క్యారెక్టర్ ను మరింత క్రూరంగా చిత్రీకరించి విలన్ క్యారెక్టర్ స్కోప్ ఎక్కువ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి కాలంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ‘కేజిఎఫ్ చాప్టర్ 1’ తరువాత రాబోతున్న ‘కేజిఎఫ్ చాప్టర్ 2’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.