గతంలో సినిమాను నిర్మాతలు నిర్మిస్తే… దానికి డిస్ట్రిబ్యూషన్ చేసే టీమ్ లు వేరేగా ఉండేవి. కానీ కాలానుగుణంగా నిర్మాతలు ఇప్పుడు బడా డిస్ట్రిబ్యూటర్స్ గా మారిపోవడంతో చిన్న చితక డిస్ట్రిబ్యూటర్స్ ను వెనక్కు నెట్టేసి, బడా నిర్మాతలు థియేటర్లను వారి చేతిలో పెట్టుకొని ఆడుతున్న జూదం నభూతో నాభవిష్యత్.

ఇప్పుడు అందరి చూపు కేజీఎఫ్ 2 సినిమాపై ఉంది. చడీ చప్పుడు లేకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యాష్ హీరోగా కన్నడ డబ్బింగ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. కొన్ని థియేటర్లలో పెద్ద సినిమాల కోసం కేజీఎఫ్ చిత్రాన్ని ఎత్తేసి, ఆ సినిమాలు ప్లాప్ కావడంతో మరలా కేజీఎఫ్ చిత్రాన్ని ఆడించిన సంఘటనలు ఉన్నాయి.

ఇప్పుడు కేజీఎఫ్ 2 పై అందరి దృష్టిలో పడింది. రాబోయే దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం ముంబై ఏజెన్సీ కంపెనీలు కర్ణాటకలో తిష్ట వేసి, ఈ సినిమా పరిస్థితేమిటి… ఎంతకు కొనవచ్చనే లెక్కలో మునిగిపోయారట. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా దాదాపుగా 40 నుంచి 50 కోట్ల మధ్యలో రేటు చెబుతుండటంతో నిర్మాతలు కమ్ డిస్ట్రిబ్యూటర్స్ షాక్ తింటున్నారట.

ముందుగా కేజీఎఫ్ మొదటి భాగాన్ని కొనుగోలు చేసిన సాయి కొర్రపాటికే ఆఫర్ ఇస్తే అతడు మాత్రం ఈ సినిమా 20 కోట్ల కన్నా ఎక్కువ పెడితే వర్క్ అవుట్ కాదని సైడ్ అయిపోయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాపై ఏషియన్ సంస్థల అధినేత సునీల్, దిల్ రాజు కూడా కన్నేసినట్లు తెలుస్తుంది. దిల్ రాజు, సునీల్ ఇప్పుడు డిస్ట్రిబ్యూట్న్ రంగంలో తమదైన అడుగులు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

కానీ 45 కోట్ల రూపాయల రేంజ్ అంటే మరీ ఎక్కువని అంటున్నా ఇప్పటికే కేజీఎఫ్ మొదటి భాగాన్ని ఆదరించే యువత పిచ్చ పిచ్చగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ పిచ్చే ఇప్పుడు 45 కోట్ల రూపాయలకు అమ్మకాలు జరపాలని కేజీఎఫ్ నిర్మాతలు భావిస్తున్నారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ పై కూడా సినిమా జనాలకు నమ్మకం ఉండటంతో పాటు ఈ చిత్రం తరువాత ప్రశాంత్… ఎన్టీఆర్ తో కలసి పనిచేయనున్నాడన్న వార్తలు కూడా స్పైసి రేట్ పలికేలా చేస్తుంది. చూద్దాం చివరకు బేరం ఎక్కడ తెగుతుందో.

సీఎం జగన్ కు కొత్త తరహా రాజకీయం నేర్పుతున్న ఈనాడు అండ్ చంద్రబాబు

శకుని పాత్ర చేసిన తరువాత తన కాళ్ళు విరగగొడతామన్నారు