పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమాన ఘనం ఎక్కవ, ఎంతలా అంటే అతడిని ఏ చిన్న మాట అన్నా సోషల్ మీడియాలో అడ్డమైనా బూతులు తిడుతూ వారిని హింసించి చిత్రహింసలకు గురిచేస్తుంటారు. అంతటి అభిమాన ఘనం ఉన్నవారు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే థియేటర్ల ముందు దుమ్మురేపుతుంటారు. “వకీల్ సాబ్” సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. కానీ వచ్చే సంక్రాంతికి “కేజిఎఫ్ 2” కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

“కేజిఎఫ్ 2” సినిమా కోసం మొదటి పార్ట్ చూసిన దగ్గర నుంచి ప్రేక్షకులు రెండవ పార్ట్ కోసం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. “కేజిఎఫ్” సినిమా ఎంత హిట్ అంటే ఇప్పటికి ఆ సినిమాను పదుల సంఖ్యలో చూసి ఉత్సాహం తెచ్చుకునేవారెందరో. సోషల్ మీడియాలో ఇపప్టికి “కేజిఎఫ్” సినిమా గురించి కొన్ని వ్యాఖ్యలు దర్శనమిస్తుంటాయి. మీలో బాధ, అసహనం నేను చేయాలేను అని దిగులుపడుతున్న సమయంలో “కేజిఎఫ్” సినిమా చూడాలని.అప్పుడు మీకు తెలియని దైర్యం వస్తుందని అంతలా ఆ సినిమా ప్రభావితం చేసేసింది.

వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్” రావడంతో పాటు అది యాక్షన్ సినిమా కూడా కాకపోవడంతో కచ్చితంగా ప్రేక్షకులంతా “కేజిఎఫ్ 2″పైనే దృష్టి పెడతారు. ఆ సినిమా దెబ్బకు పవన్ కళ్యాణ్ సినిమా నిలవలేదని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇక దీనితో పాటు కరోనా నేపథ్యంలో ఆగిపోయిన కొన్ని సినిమాలు సంక్రాంతి రేసులోకి వచ్చేశాయి. చూడాలి “కేజిఎఫ్ 2” దెబ్బకు వచ్చే సంక్రాంతికి ఎన్ని సినిమాలు చిన్న బిన్నమైపోతాయో. అసలే “కేజిఎఫ్ 2” సినిమాలో హీరో పాత్రకు ప్రతినాయకుడు పాత్రలో పవర్ ఫుల్ యాక్టర్ సంజయ్ దత్ ను చూపించనున్నారు.