కార్తీ తాజాగా నటించిన చిత్రం ‘ఖైదీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 25న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన మొదటి షో నుండే హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

పదేళ్ల తర్వాత విడుదలైన ఓ ఖైదీ తన కూతురిని తొలిసారిగా చూసేందుకు చేసే ప్రయాణం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. భారీ యాక్షన్ సీన్స్ తో పాటు కంటతడి పెట్టించే ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. విజయ్ సినిమా ‘బిగిల్’ కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా విజయం సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా సత్తా చాటుతుంది. ఈ సినిమా రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాలలో 12.5 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి కార్తీ సినిమాలలో రికార్డు సాధించింది.