మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా వస్తున్న తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయ్యింది. గతంలో ఎప్పుడు లేని విధంగా చిరు ఈ సినిమాలో డిఫెరెంట్ షేడ్స్లో నటిస్తున్నాడు. ఈ సినిమాను మాగ్నా ఎంటర్టైమెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థలపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ లో మెగాస్టార్ నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనది. హీరోకి చెల్లి పాత్ర అయిన ఈ పాత్రను తెలుగు వర్షన్ లో సీనియర్ బ్యూటీ కుష్బూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. హీరో పై ద్వేషంతో రగిలిపోతూ చివరికి హీరో సాయం కోరే ఎమోషనల్ రోల్ లో కుష్బూ పూర్తి న్యాయం చేస్తుందంటున్నారు. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన రావలసి ఉంది.

బిగ్ బాస్-4 లో పాల్గొనబోయే సెలబ్రిటీస్..?

టిక్ టాక్ పోతే పోయింది.. ‘చింగారి’ వచ్చిందిగా..!