కియా కార్లు అతి త్వరలో మన రోడ్లపైనా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కియా మోటార్స్ అఫ్ ఇండియా సెల్తోస్ కార్ల కోసం ఆన్ లైన్ లో బుకింగ్ ఓపెన్ చేయగా ఇప్పటికే అధికంగా బుకింగ్ చేసుకున్నారు. గత నెల 16న కియా కార్ల బుకింగ్ ఓపెన్ చేయగా ఈరోజుకి దాదాపుగా 32 వేల కార్లను బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆన్ లైన్ లో కార్లు బుక్ చేసుకున్న వారికి ఈనెల 22 నుంచి కార్లను అందించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. గత వారమే అనంతపురంలో ఏపీ మంత్రులు కియా కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  
  •  
  •