పవన్ కళ్యాణ్ రాజకీయాలకు చిన్న విరామం ప్రకటించి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు ముందుగా ఇప్పుడు “పింక్” సినిమా రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరొక రెండు సినిమాలకు కూడా ఒకే చేశారు. ఇక క్రిష్ సినిమా కూడా ఇప్పటికే లాంఛనంగా మొదలు కావడంతో ఆ సినిమాలో హీరోయిన్ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి కైరా అద్వానిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తుంది. కాని తనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో నో చెప్పేసిందని ఫిల్మ్ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి.

కాని చిత్ర యూనిట్ మాత్రం పవన్ కళ్యాణ్ – కైరా జోడి బాగుంటుందని భావించినా నో చెప్పడంతో ఇప్పుడు మరొక ప్రముఖ బాలీవుడ్ నటి వాని కపూర్ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. వాని కపూర్ గతంలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన నాని హీరోగా ‘ఆహా కళ్యాణం” సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు కైరా అద్వానీ ఒప్పుకోకపోవడంతో వాణి కపూర్ ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమాను వదులుకున్న కైరా అద్వాని, మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోయే సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. చిత్ర యూనిట్ మహేష్ బాబు కోసం కైరాను సంప్రదించగా ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన “భారత్ అనే నేను” సినిమాలో హీరోయిన్ గా నటించింది.