వైసీపీలో గెలిచి టీడీపీలోకి పిరాయించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు. కిడారిని మావోయిస్టులు చంపిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆయన కుమారుడైన శ్రావణ్ కి మంత్రి పదవి ఇవ్వలని భావిస్తున్నారట. నాలుగున్నరేళ్ళపాటు మంత్రి వర్గంలో ముస్లింలకు కానీ, గిరిజనులకు కానీ చోటు కల్పించని బాబు.. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నాడు. తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశతో పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కి ఇప్పుడు షాక్ తగిలింది.

గిరిజన కోటాలో తనకు మంత్రి పదవి ఇస్తారనుకుంటే ఇప్పుడు బాబు కిడారి తనయుడు శ్రావణ్ కి ఆ పదవి ఇవ్వనున్నారు. కిడారి తనయుడుని మంత్రిని చేయడం ద్వారా గిరిజనుల నుండి సానుభూతు వస్తుందని బాబు అంచనా వేస్తున్నారు. అలాగే ముస్లిం కోటాలో ఇప్పటి వరకు ఒక్క ముస్లిం కూడా మినిస్టర్ కాలేదు. కావున మైనారిటీల నుండి సీనియర్ నేత ప్రస్తుత కౌన్సిల్ చైర్మన్ ఫరూఖ్ ను ఎంపిక చేయవచ్చని భావిస్తున్నారు. కాగా గత ఎన్నికలలో కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి ఇద్దరు వైసీపీలో గెలిచి టీడీపీలోకి పిరాయించిన సంగతి తెలిసిందే.