ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత కొంత కాలం నుండి కనిపించకున్నా పోయాడని.. అతను కోమాలోకి వెళ్లాడని పలు రకాలుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరకొరియాలో పెద్ద వేడుకగా జరిపే కిమ్‌ జోంగ్‌ ఉన్ తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలకు కూడా కిమ్‌ జోంగ్‌ ఉన్ హాజరుకాకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంకా కొంత మంది మరో అడుగు వేసి కిమ్ జోంగ్ కు శస్త్ర చికిత్స జరిగిందని.. అతని ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడని ఆరోపించారు. అయితే అతని సన్నిహితులకు తప్ప ఆయన గురించి వివరాలు బయటకి రాలేదు. అయితే ఆయన 20 రోజుల తరువాత బయటకి వచ్చి రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపంలోని సన్‌చిన్‌లో ఎరువుల కర్మాగారం పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో‌ పాల్గొన్నారు.

అయితే కిమ్ జోంగ్ అలా నటించడానికి, ఆ విధంగా వార్తలు సృష్టించడానికి బలమైన కారణం ఉందట. ఒకవేళ కిమ్ మృతి చెందితే దేశంలో ఎలాంటి కుట్రలు జరుగుతాయి. దేశాన్ని ఎలా ఆక్రమించుకోవాలని చూస్తారు. ఎవరు ఏ విధంగా కుట్రలు చేస్తారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కిమ్ నాటకం ఆడారట. కాగా ఈ 20 రోజుల్లో తమపై ఎవరెన్ని కుట్రలు చేశారు.. వారి సమాచారాన్ని అంతటిని కిమ్ సేకరించే పనిలో ఉన్నారని.. వారి పని త్వరలోనే పట్టేందుకు కిమ్ సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

హైదరాబాద్ లో మద్యం కోసం క్యూ కట్టిన అమ్మాయిలు.. సోషల్ మీడియాలో వైరల్..!

ముఖ్యమంత్రి కారు డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర కలకలం..!

గుడ్ న్యూస్.. కరోనాకు వ్యాక్సిన్ సిద్ధం చేశామని ప్రకటించిన ప్రముఖ దేశం..!