గత కొద్ది కాలంగా కొడాలి నాని, వైసిపి పార్టీ కార్యక్రమాలలో యాక్టీవ్ గ ఉన్నట్లు కనపడటం లేదు. అలా అని వైసిపి పార్టీ మీద సమ్మతితో ఉన్నారా అంటే అది లేదు. కానీ కొడాలి నాని తన మిత్రుడు వంగవీటి రాధకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలని వైసిపి పెద్దలను అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆ సీటు ఇప్పటికే మల్లాది విష్ణుకు ఇవ్వడంతో వంగవీటి రాధకు అక్కడ ఇవ్వడం కుదరదనట్లుగా చెప్పి విజయవాడ తూర్పు స్థానం నుంచి వంగవీటి రాధా గెలిచే సూచనలు ఎక్కువగా ఉన్నాయని వైసిపి పెద్దలు సూచించారట.

ఆ విషయంలోనే కొడాలి నాని కొంత నొచ్చుకొని ఉన్నట్లు అందుకే కొన్ని రోజులు నియోజకవర్గానికి పరిమితమైనట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ ఏదైనా పెద్ద కార్యక్రమం చేసే క్రమ్మలో కొడాలి న్నాయి తప్పకుండ ఉండి వైఎస్ జగన్ కు అండగా అనిలవడంలో ముందు వరుసలో ఉండేవాడు. కానీ కొన్ని రోజులు నాని యాక్టీవ్ గ లేకపోవడంతో వైసిపి అభిమానులు కూడా కొంత ఆందోళన చెందారు. కానీ ఏదైతేనేం ఈరోజు కొడాలి నాని చాల రోజుల తరువాత వైసిపి పార్టీ ఆఫీస్ నుంచి చంద్రబాబు నాయుడు మీద ఘ్తైనా విమర్శలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తాడు.

జీవిత కాలం ఆయనే సీఎం

ఇక ఈ రోజు కొడాలి నాని మాట్లాడుతూ ఒక్కసారి వైఎస్ జగన్ సీఎం అయితే జీవిత కాలం ప్రజలను ఆయనే పాలిస్తాడని, ముక్యమంత్రిగా ఎపి ప్రజలకు అండగా ఉండి వారి బాధలు తెరుస్తాడని చెప్పుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు టైం ఇక అయిపోయిందని, చంద్రబాబు నాయుడు కనీసం తనకున్న 120 రోజుల సమయాన్ని అయినా సరిగ్గా వాడుకొని ప్రజలకు మంచి చేయాలని కొడాలి నాని పిలుపునిచ్చాడు.

ప్రజాక్షేత్రంలో ఐదు సార్లు ఓడిపోయి దొడ్డి దారిన మంత్రి పదవిని సంపాదించుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్ధం కావడం లేదని, జగన్ సైకో కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అసలైన సైకో అని, తమది కోడి కాత్తి పార్టీ అయితే తెలుగుదేశం పార్టీది కతప్ప కత్తి పార్టీనా అని కొడాలి నాని ప్రశ్నించారు. కొడాలి నాని చాల రోజుల తరువాత పదునైన మాటలతో మరోసారి విమర్శలు చేయడంలో కొడాలి నాని మీడియా సమావేశం సిసిల మీడియాలో హల్ చల్ చేస్తుంది.